Drugs Smuggler: అమెరికాలో డ్రగ్ స్మగ్లర్ ను హతమార్చిన బిష్ణోయ్ గ్యాంగ్.. ! 14 d ago
అమెరికాలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ హత్యకు గురయ్యాడు. కాలిఫోర్నియాలోని స్టాక్టన్ ప్రాంతంలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు సునీల్ యాదవ్ ను హత్య చేసారు. భారతదేశంలో పలు డ్రగ్ అక్రమ రవాణా కేసుల్లో వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్య తమ పనే అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.